పొలం నుంచి మన ఇంట్లో ఫ్రిజ్ లోకి చేరేలోగా కూరగాయలు పండ్లు ఎన్నో మజిలీలలో దుమ్ము మురికి నింపుకొంటాయి పైగా వాటిని పండించేందుకు వాడిన రసాయనాల బెడద కూడా వుంటుంది. వాటిని శుభ్రం చేయాలంటే ముందుగా చల్లని నీటిధార కింద పెట్టి చేత్తో రుద్ది కడగాలి. అలాగే నీళ్ళలో వెనిగర్ కలిపి అందులో కాయగూరలు నానా బెట్టి రుద్ది కడగాలి లేదా ఉప్పు గానీ బేకింగ్ సోడా గానీ వేసిన నీళ్ళలో కూరగాయలు ఐదు నిముషాలు ఉంచి కడగచ్చు. అలాగే ఒక వెడల్పు గిన్నెలో నీళ్ళు మరిగించి ఆ నీళ్ళలో కూరగాయలు పడేసి రెండు ముడు నిముషాల్లో వాటిని చల్లని నీళ్ళలో వేయాలి. ఒక కప్పు నీళ్ళలో నిమ్మరసం,వైట్ వెనిగర్ కలిపి దీన్ని ఒక గాజు బాటిల్ లో నిల్వ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూరలు పండ్ల పైన పట్టించి బాగా రుద్ది కడిగేస్తే శుభ్రంగా ఉంటాయి.
Categories