కొన్ని రకాల డ్రెస్ లు పురుషులకే పరిమితం అనుకుంటారు అమ్మాయిలు మంచి సూట్లు ప్యాంట్లు షర్టులు ఇలాంటివి కానీ ఇప్పుడు ఇలాంటివన్నీ శ్రీ పురుష బేధం లేకుండా ఆఫీస్ లకు వేసుకునే ఫార్మర్స్. కాకపోతే మరీ సీరియస్ గా కనిపించకుండా కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలి. జీన్స్ కాటన్ ప్యాంట్లు స్ట్రెయిట్ పెన్సిల్ కట్ తో ఉండేలా చూసుకుని దానిపైన పొడవాటి కుర్తీ వేసుకుంటే బావుంటుంది. పొడవాటి కుర్తీలకు లూజ్ గా వుండే షర్టుల్లకు పలాజో లు వేసుకోవటం ఇప్పటి ఫ్యాషన్. రెండు మూడు రంగుల పలాజో లు ఉంటే  కాంబినేషన్స్ చూసుకోవచ్చు. కాస్త సన్నగా ఉంటే చిన్న ప్రింట్లున్న పొడవాటి స్కర్టులు వేసుకోవచ్చు. స్కర్టులు ప్యాంట్లు రెగ్యులర్ గా వేసుకోవాలి అనుకుంటే వదులుగా అలాగని వంటికి అతుక్కుపోయేలా కాకుండా నడుము దగ్గర పట్టి వుంటే ఏ లైన్ తరహాకి ప్రాధాన్యత ఇవ్వచ్చు. జీన్స్ టీషర్ట్స్ పైకి కోటు  కూడా చక్కగానే ఉంటుంది. కోట్లు సాధారణంగా సూటింగ్ క్లాత్ లో  వుంటాయి.కానక నేతతో కూడా వస్తున్నాయి. అవి తేలిగ్గా బావుంటాయి. మోడ్రన్ కనబడాలి అనుకుంటే కొన్ని కొత్త కాంబినేషన్స్ జత చేస్తే ప్యాంట్లు షర్టులు అమ్మాయిల వార్డ్రోబ్ లో లక్షణంగా వుంచుకోవచ్చు.

Leave a comment