స్విస్ బాల్ తో చేసే వ్యాయామం మంచి ఫలితం ఇస్తుంది అంటారు ఎక్సపర్ట్స్.కుర్చీ లో ఎక్కువ సమయం కూర్చుంటే శరీరానికి రక్త ప్రసరణ సరిగ్గా అందదు. ఈ స్విస్ బంతి పైన కూర్చోవడం వల్ల శరీరం నిటారుగా ఉంటుంది.నడుం నొప్పి ఉండదు రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది.అలాగే మెట్లు ఎక్కి దిగడం చేస్తే కాలి కండరాలు దృఢంగా ఉంటాయి.రక్తంలో ఆక్సిజన్ నిల్వలు పెరుగుతాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామా లతో పని ఒత్తిడి పై పోరాడే ఫీల్ గుడ్ ఎండార్ఫిన్ లు  విడుదలై మంచి ఫలితాలు ఇస్తాయి.  ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి.

Leave a comment