మీ అందమైన చర్మ రహస్యం ఏమిటి? అని సినిమా తారలను సాధారణంగా అడుగుతూ వుంటారు. వీళ్ళెం సమాధానం చెప్పినా మెరుపులీనే చర్మపు రహస్యాలు వంటింట్లో దాక్కుని వున్నాయన్న మాట మాత్రం నిజాం. తేనె సహజమైన యాంటీ సెప్టిక్ . చర్మం లో తేమను పట్టి ఉంచుతుంది. ముఖం, మెడకు తేనె రాసి పది నిమిషాల తర్వాత కడిగి చుస్తే చర్మం మెరుపు తెలుస్తుంది. తేనె నిమ్మరసం కూడా ఇలాగే చర్మానికి మంచి రంగు ఇస్తాయి. ఇంకో చక్కని చిట్కా మెత్తని బట్ట లో ఐస్ ముక్కలు చుట్టి మొహం పైన మసాజ్ చేసినట్లు రుద్దితే రక్తం సరఫరా మెరుగయి చర్మం ఎంతో బావుంటుంది. మేకప్ ముందు ఈ చిట్కా ఉపయోగిస్తే మేకప్ చాలా సేపు చెదిరి పోదు. ఇక చక్కని టమాటా చక్రాల్ని మొహం పైన రుద్దితే కుడా చర్మం చక్కగా మెరుపుతో కనిపిస్తుంది. ఇక సెనగపిండిని పెరుగు కలిపి రాస్తే ఈ మిశ్రమం చర్మానికి క్లెన్స్ చేస్తుంది.
Categories