ఊపిరి తిత్తులు బలపరిచే వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం అంటున్నారు డాక్టర్లు. వైరస్ ప్రభావం నుంచి ఊపిరి తిత్తులను కాపాడుకోవాలంటే ప్రాణాయామం తో పాటు పరుగెత్తటం, మెట్లు ఎక్కటం, వేగంగా నడవటం వంటివి చేయాలి. సాధారణంగా ప్రకృతి చికిత్స లో ఆవిరి స్నానం ముఖానికి ఆవిరి పట్టడం పీల్చటం అల్లం రసం సుప్ తాగటం మొదలైనవి ఉంటాయి. ఛాతికి వెన్నుకు వేడి నీటి కాపడం, ఉప్పు కాపడం కూడా ఊపిరి తిత్తులకు మేలు చేస్తాయి.కర్పూరానికి రక్తనాళాలను విప్పార్చే   గుణం ఉంటుంది. కనుక కర్పూర తైలం తో  ఛాతి పైన  మర్దన చేసుకోవచ్చు వీటితోపాటు విటమిన్ డి, విటమిన్ b12, మాంసకృత్తులు, పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు లేని వారికి కూడా కరోనా సోకే అవకాశం ఉంది కనుక ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు చేసే అన్ని రకాల వ్యాయామాలు చేయాలి.

Leave a comment