ఫ్యాషన్ లో చెప్పులకు కూడా చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది. కొన్ని డ్రెస్ లకు చెప్పులే అందం కూడా. జీన్స్ మినీ స్కర్టులు వేసుకుంటే బ్యాల్ వంటివి బావుంటాయి,చాలా సౌకర్యం కూడా. వాటితో పాటు స్ట్రాపీ సాండిల్స్, కిచెన్ హీల్స్ వంటివి కొన్ని సందర్భాల్లో డ్రెస్ లను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.ప్రతి సందర్భానికి హీల్స్ బావుంటాయి అనుకుంటారు కాని అన్ని దుస్తులకు ఇవి మ్యాచ్ కావు. మినీ గౌన్లు,స్కర్టుల మీదకు కూడా కాస్త ఎత్తు రకాలు బాగానే ఉంటాయి.పలాజోలు,ధోతి తరహా దుస్తులు వేసుకుంటే లెడ్జ్ రకాలు ఇకపోతే అనార్కలీలు,లెగ్గింగ్స్ అయితే పెన్సిల్ హిల్స్ చక్కగా ఉంటాయి. ఏవైన సరే సౌకర్యం,సందర్భం చాలా ముఖ్యం.

Leave a comment