జిమ్ లు ప్రారంభం అయ్యాయి గానీ కరోనాతో బయటకు వెళ్లాలంటే తెలియని భయం.ఇంట్లోనే యాప్ ల సహాయంతో వ్యాయామం చెయ్యండి అంటారు ఎక్స్పర్ట్స్. ఫిట్ ఆన్ యాప్ ని ఎంచుకుంటే శరీరంలో ఏ భాగంలో కొవ్వుని ఎలా తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఆ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి. స్వార్ కిట్  యాప్ తోడుగా ఉంటే వ్యక్తిగత వ్యాయామ సలహాదారు ఉన్నట్లే.వ్యాయామం ఎలా మొదలు పెట్టాలి ఎంత సేపు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తాయి.స్ట్రాలా యాప్ ఎంత దూరం పరిగెత్తారు ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో చెప్పేస్తుంది.

Leave a comment