కాస్తో కూస్తో మేకప్ అలవాటయిపోయింది అందరికీ సందర్భం ఏదైన సింపుల్ మేకప్ అయినా కావాలి.ఐ లైనర్,పెదాల రంగు ,బ్లష్ ఇవన్ని వేసుకొన్నాక వాటిని క్లీన్ చేయడం కూడా అంతే ముఖ్యం అనుకోవాలి. ఇందుకోసం రసాయనాలు వాడక్కర్లేదు. ఇంట్లో దొరికే పాలు చాలు, పాలల్లో రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి అందులో ముంచిన దూదితో మేకప్ ఈజీగా తుడ్చేయవచ్చు.అలాగే తేనే పైన కాస్త వంట షాడో చల్లి దాన్ని దూదిలో ముంచి ముఖం పై మేకప్ తుడుచుకోవచ్చు. చర్మం తేమగా మృదువుగా అనిపిస్తుంది. ఇక వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే కొబ్బరి నూనె తేనె కలిపి ఆ మిశ్రమంతో ముఖం పై మేకప్ ఈజీగా తొలగించవచ్చు. కానీ కాస్త మేకప్ వేసుకున్న సరే దాన్ని పూర్తిగా తొలగించకుండా నిద్రకు ఉపక్రమించకూడదు.

Leave a comment