ఎన్నో పార్టీలకు , పుట్టిన రోజు ఫంక్షన్స్ కు హాజరవుతాము. ఒక్కొసారి వాళ్ళకు ఇచ్చేందుకు మంచి కానుక ఏదో ఎంత ఆలోచించిన తట్టదు. సందర్భం ఏదైనా సరే చక్కని మొక్కని బహుకరించటం మంచి పద్ధతి. కాస్త చోటు ఉన్న అమర్చు కోగలిగే, స్టెప్స్ ఉన్న పూల కుండీల్లో మనీ ప్లాంట్స్,జేడ్ , మాండ్ విల్లా మొదలైన మొక్కలు పెట్టి ఇవ్వొచ్చు. టీనేజ్ అబ్బాయి, అమ్మాయిలు ఎవరైనా సరే వ్యాయామ పరికరాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్న పిల్లలు ,ఐదేళ్ళలోపు పిల్లలు అయితే దుస్తులు, టాయిస్ తో పాటు వాళ్ళకు ప్రతి రోజు ఉపయోగపడే సోప్స్, బేబీ ఆయిల్స్ పిల్లలకు వాళ్ళు ఏ వస్తువులు వాడుతున్నారో తెలుసుకొని అదే బ్రాండ్ బహుకరిస్తే చాలా బావుటుంది.

Leave a comment