ఎలాంటి స్క్రబ్స్  వాడితే చర్మం బావుంటుందోనని ఎప్పుడు డౌట్ వస్తూనే వుంటుంది. చర్మం మృదువుగా ప్రకాశవంతంగా వుండాలంటే  పెరుగు పసుపు కలిపిన స్క్రబ్ ఏ కాలంలో అయినా మంచిదే . ముఖ్యంగా చలిరోజుల్లో ఈ స్క్రబ్ ముఖానికి మెడకు పట్టించి పావుగంటాగి కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సెనగపిండి ఇంకో నాలుగు టీ స్పూన్స్ పెరుగు బ్లెండ్ చేసి ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించినా మంచిదే. చర్మం పొడి బారటం  కంటి కింద వలయాలు తగ్గి సహజామైన మెరుపులు రావాలంటే బాదాం పొడి అలోవెరా జల్ సమపాళ్లలో కలిపి అప్లై చేయాలి. ఇది అన్ని రకాల చర్మాలకు అన్ని వేళలా  మేలు చేస్తుంది. ఇంకా వీలయితే ఈ స్క్రబ్ మిక్స్ లో జట్స్, తేనె,అర టీ స్పూన్ త్రిఫులా పొడి కలిపినా ఇంకా మంచిది. చర్మం మృదువుగా అయి ఎలాస్టిసిటీ మెరుగు పడుతుంది.

Leave a comment