మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క.  శరీరం ఎట్లా చురుగ్గా ఉండాలని వర్కవుట్స్ చేస్తామో, మెదడు ఆరోగ్యం కోసం కూడా కొన్ని ఎక్సర్ సైజ్ లు , మంచి ఆహారం తీసుకోవాలి.  రక్తంలో ఫాలేట్ స్థాయిలు తక్కువగా ఉంటే 60 శాతం వరకు జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  ఒక చిన్న పరీక్ష చేసుకుంటే మెదడు పని తీరు తెలుస్తుంది.  గత ఐదు రోజుల్లో డిన్నర్ లో ఏం తిన్నామో గబగబా చెప్పగలిగితే మెదడు చురుగ్గా ఉన్నట్లే , లేదా జ్ఞాపకం రావడం  లేదు అంటే ఫాలేట్ స్థాయిల్ని పెంచుకోవాలి.  పాలకూర, తోటకూర ఇతర ఆకుకూరలు ప్రతి రోజు తీసుకుంటే చాలు .  ప్రతి రోజు వీలైనన్నీ ఆకుకూరలు తింటే మెదడు పని తీరు ఎప్పుడు బావుంటుంది.

Leave a comment