ఏం తిన్నా పర్లేదు, ఎంటాసిడ్ తాగితే వెంటనే ఉపసమనం అని బోలెడన్ని యాడ్స్ వస్తుంటాయి. డాక్టర్ ను సలహా అడక్కుండా ఎసిడిటీ కి ఈ ఎంటాసిడ్స్ తాగేస్తారు కానీ ఇందులో ఉండేవి కాల్షియం, సోడియం, కార్బోనేట్స్ ఇవి తాగగానే యాసిడ్ కి విరుగుడుగా పని చేసే ఉపసమనం ఇస్తాయి. అవి ఇవి వాడుతూ పొతే వీటి లోని రాసాయినాలు కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిర్వీర్యం చేస్తాయి. అందుకే ఈ తాత్కాలిక ప్రయోజనం ఇచ్చే వాటిని నమ్ముకునే బదులు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే పోతుంది. ముందుగా కారం, మసాలా ఊరగాయలు దూరం పెట్టాలి. కడుపును ఖాళీగా ఉంచకూడదు. ఎవరైతే అదుర్దా అధికంగా పడతారో, ప్రతి చిన్న విషయానికి చింతిస్తారో , వేపుళ్ళు,  మసాలాలు అధికంగా తింటారోఉవంటి వారికే ఎసిడిటీ సమస్య వస్తుంది.    క్రమ పద్దతి లో నిద్ర, వ్యాయామం, ఆందోళనలు లేని జీవిత విధానంలో అనారోగ్యాలకు టావు లేదు.

Leave a comment