ఎన్నో గింజలని కాయగురల్లోంచి తీసి పారేస్తాం కానీ వాటిల్లో అపారమైన పోషకాలుంతాయి పీచూ, అత్యవసర ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లకు ఈ గింజలు ఆధారంగా ఉంటాయి. ఉదాహరణకు దోసకాయ, గుమ్మడికాయల్లో వుండే గింజలు తీసేసే కూర వండుతాం కానీ గింజల్లో ఎన్నో ప్రయోజనాలు గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా వుంటుంది. రోగనిరోధక వ్యవస్ధను గుమ్మడి గింజలు బలోపేతం చేస్తాయి. కణాల ఎదుగుదలను పెంచుతాయి ఇన్సులిన్ ను క్రమబద్దీకరించడం లో, డయాబెటిక్ నియంత్రణలో ఉపకరిస్తాయి. మెలటోనిన్, సెరటోనిన్ ఉత్పత్తి అవసరమైన ట్రాఫ్టోఫిన్ కు మంచి ఆధారం కావడం వల్ల సుఖనిద్రనిస్తాయి. చర్మం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని పచ్చగా మలుచుకుని తినేయిచ్చు. చల్లని, వేడి సెరల్స్ లో కలుపు కోవచ్చు. వెల్లుల్లి తో కలిపి నూరి కురళ్, సలాడ్ లు, సూప్ ల్లో వేస్తే చక్కని రుచి ఆరోగ్యం రెండు దక్కుతాయి.

Leave a comment