సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పగులుతూ ఇబ్బంది పెడతాయి. ఖరీదైన లిప్ బామ్ లకంటే వంటింటి చిట్కాలే పెదవుల సంరక్షణకు బాగా పని చేస్తాయి. తేనె లేదా గ్లిజరిన్ పెదవుల మైస్చురైజింగ్ కు పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏది అప్లై చేసినా కాసేపట్లోనే ఫలితం కనిపిస్తుంది. నిమ్మఆకుల ముద్ద కానీ, అలోవీరా ముద్ద కానీ పెదవులకు అప్లై చేసినా ఫలితం బావుంటుంది. కీరా ముక్కలతో పెదవులపై రుబ్ చేసినా పెదవులు మృదువుగా అయ్యిపోతాయి. రోజు మొత్తంలో వీలైనన్ని సార్లు ఇలా రబ్ చేయొచ్చు. వీట్ జర్మి ఆయిల్, టొమాటో జ్యూస్ , పాలకూర జ్యూస్ ఇవన్నీ కలిపి అప్లయ్ చేస్తే పెదవులు మెత్తగా, గులబీ రంగులో కనిపిస్తాయి. పెదవులు పగలకుండా నిమ్మరసం మందు లాగా కాపాడుతుంది. తేనె, గులాబీ రేకుల పొడి కలిపి అప్లయ్ చేస్తూ వుంటే పెదవులు మంచి రంగులో వుంటాయి. అలాగే విటమిన్-ఇ వున్న లిప్స్ టిక్ వాడినా పెదవులు సహజమైన అందం కాపాడుకొ వచ్చు. ఖరీదైన రసాయినాలు కలసిన ఉత్పత్తుల కంటే ఈ సహజమైన లిప్ బామ్ లు పెదవుల అందాన్ని కాపాడుతాయి అనడం లో సందేహం లేదు.

Leave a comment