శాన్ ప్రాన్సిస్కో విధుల్లో ఇప్పుడు మూడు బస్ లు తిరుగుతున్నాయి. మూడేనా? అంటే ఈ మూడే విధుల్లో వుండే అనేక మంది రోడ్డు పక్కన నివసించే వాళ్ళకు బాత్ రూమ్స్. ఈ సౌకర్యం కలిగించిన డోనైసి శాండోవల్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్. ఆమె కొచ్చిన ఈ ఆలోచన ఎంతో మంది ఇళ్ళు లేని నీరు పేదలకు ఇలా ఇల్లు లేకుండా రోడ్డు పక్కన నివసించే వాళ్ళ సంఖ్య 6500మంది కంటే ఎక్కువే. వాళ్ళకు స్నానం చేసే అవకాశం ఇప్పుడో కానీ లేదు. ఆ అవస్థను గమనించిన శాండోవల్ పాత బస్సులు కొని వాటిని స్నానాల గదులుగా మార్చేసింది. రోడ్డు పక్కన నివశించే వాళ్ళ దగ్గరకు ఈ బస్సులు వస్తాయి. ఒకటికి రెండు మూడు బస్సులయ్యాయి. అన్ని వీధులు తిరుగుతాయి. శాండోవల్ సంకల్పానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు.

Leave a comment