ఇన్ విజబుల్ సెట్టింగ్ లేదా మిస్టరీ సెట్టింగ్ నగలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలాంటి లొహాంతో అతుకులు లేకుండా పూర్తీ జాతి రాళ్ళ నగలివి. ఈ నగల్లో రాళ్ళు ఒక దానికోకటి అతుక్కొని ఉండేలా పొదిగి తయారు చేస్తారు.వీటిలో రూచీ ఇయర్ టాప్స్ పేరుతో ఆన్ లైన్ లో వెతికితే బర్మస్ రూచీస్ తో తయారైన వేలాడే ఇయర్ టాప్స్ కనిపిస్తాయి. స్టన్నింగ్ జ్యువెలరీ పేరుతో వజ్రాలు పొదిగిన ధగధగలాడే నెక్లెస్ లు కనిపిస్తాయి. ముత్యాలు వజ్రాలు పొదిగిన ఇన్ విజబుల్ సెట్టింగ్ జ్యువెలరీ కనిపిస్తాయి.ఇవి ఏ వేడుకకైన అందం.

Leave a comment