లిచీ జాతికి చెందిన కుంకుడు జుట్టుకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వగలుగుతోంది. వాటిలో విటమిన్ ఏ ,కె లాంటి పోషకాలు వుంటాయి. ఇవి సహజంగా చెట్టుకు కాసినవి కనుక,కోసి ఎండబెట్టి వాడుకునేవి కనుక ఇందులో రసాయనాలు కలిసే ఆవకాశం లేదు కనుక జుట్టు శుభ్రం చేసేందుకు వాడుకోవచ్చు. షాంపుల కంటే వంద రేట్లు సురక్షితం నాణ్యమైన కుంకుడు కాయిలు ఎంచుకొని కాస్త పగలకొట్టి అందులో గింజలు తీసేయాలి. వేడి నీళ్ళలో ఈ కుంకుడు కాయలు నానబెట్టి మెత్తగా చేతితో పిసికిన చక్కని నురుగు వస్తుంది. ఈ నురుగు తో తల స్నానం చేస్తే ఇందులోని పోషకాలు జుట్టు కలిసినపుడు చక్కగా పొడవుగా పెరిగేలాచేస్తాయి.

Leave a comment