ఏదైనా ప్రత్యేక సమయాల్లో సరైన ఎంపిక కంచి పట్టు చీరలే. పెద్దంచు చీరలు, పరికిణీలు, ఓణీలు ఇప్పుడు బావుంటాయి. బెనారస్ పైథాణీ చీరలు చక్కనివే. సీల్, ఖాదీ, పట్టు, లెనిన్, అహింసాసిల్క్ ఎంచుకుంటే సౌకర్యంగా తేలికగా ఉంటాయి. రంగులు  కుడా కాంతి వంతంగా ఉంచాలి. ఎంచుకున్న దుస్తులాక్, తగిన నగలు వుండాలి. కంచి పట్టు చీరకు బంగారు నగలు బావుంటాయి. ఇక ఆధునికంగా కనిపించాలి అనుకుంటే అక్సిడైజ్డ్ జుంకీలు మేడలో నెక్లెస్ లు చక్కగా నప్పుతాయి. జోద్ పూరీ, కొల్వా పురీ చెప్పులతో మొత్తం అలంకరణకే నిండుదనం వస్తుంది. ప్రేత్యేక సంధర్బాలైనా చీరలు, పరికిణీలు వద్దను కొంటే కుర్తీ, ధోతీ అనార్కలీ, నేలను తాకినట్లుండే ఫోర్స్ లెంగ్త్ గౌన్లు,  పట్టు రకాలు, చేనేత ఎంబ్రాయిడరీ  కలగలిపి వున్నా నిండుగా ఉంటాయి. పది మందిలో ప్రేత్యేకంగా కనిపించాలంటే ఇప్పుడు కొత్త కామ్బినేషన్స్ ట్రయ్ చేయాల్సిందే.

Leave a comment