ఏదో ఒక కొత్తదనం కావాలి . నిన్న భలే అనిపించింది రేపటికి ఓల్డ్ ప్యాషన్ అయిపోతుంది. ఫ్యాషన్ డిజైనర్స్ అలిసి పోకుండా కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉంటారు. అందమైన ఫ్యాన్సీ పట్టు .జరీ చీరెల మ్యాచింగ్ గా కోల్డ్ షోల్డర్ డిజైనర్ బ్లవుజ్ లు ఫ్యాషన్ గా మార్కెట్లోకి వచ్చాయి. హై నెక్కులు , ఫోల్డర్ హ్యాండ్స్ , కాలర్ నెక్ తో కాలం చెల్లిపోయి ఈ కోల్డ్ షోల్డర్ ఫ్యాషన్ వచ్చింది. వందలాది డిజైన్స్ ఇమేజెస్ చూడోచ్చు. ఈ వెరైటీ బ్లవుజ్ కు భుజం క్రిందగా కట్ చేసి చుట్టు జరీ ఎంబ్రాయిడరీ అల్లేసి దానికి జ్యూలరీ కూడా మ్యాచ్ చేస్తున్నారు. ఈ చిల్లుల బ్లౌజ్ అందమే అందం.

Leave a comment