నిరంతరం వ్యాయామంతో ఫిజికల్ ఫిట్ నెస్ కలిగి ఉన్న వాళ్లను కోవిడ్ వదలక పోయినా క్రమం తప్పక వ్యాయామం చేసే వారిలో కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. అలాగే రోజుకు 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేసే వారు కూడా కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు వ్యాయామం చేసే అలవాటు లేనివారు ఐ సి యూ లో అడ్మిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ అలాగే కోవిడ్ ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదం కూడా 2.49 రెట్లు ఎక్కువ కనుక కోవిడ్ సెకండ్ వేవ్ లో అడుగు పెట్టిన ప్రస్తుత సమయంలో దీని నుంచి రక్షణ పొందడం కోసం వీలైనంతవరకు ఇంటి పట్టునే వ్యాయామం చేయటం మంచిదంటున్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా 30 నిమిషాలు వేగంగా నడవటం దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

Leave a comment