మాస్కు ధరించి జాగింగ్, వాకింగ్ చెయ్యకండి ప్రమాదం అంటున్నారు ఎక్స్ప్రెస్. ఆరుబయట ఈ వ్యాయామాలు చేసే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్క్ ధరించటం మానేయ మంటున్నారు.వ్యాయామ సమయంలో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటారు. మాస్క్ ధరిస్తే ఊపిరి పిలిచేందుకు ఊపిరితిత్తులు ఎక్కువ శ్రమ పడతాయి.గాలి అందక తేలికగా అలసిపోతారు వ్యాయామంతో చెమటతో, మాస్క్ మరింత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉబ్బసం, గుండె, జబ్బులు  కల వాళ్ళు వ్యాయామ సమయంలో మాస్కులు అసలు ధరించవద్దు. ఆరుబయట చేయలేని పరిస్థితి వస్తే ఇంట్లోనే వర్కవుట్స్ చేయటం మేలు.

Leave a comment