Categories
WhatsApp

ఎక్సట్రా వర్జిన్ ఆయిల్ బెస్ట్.

మార్కెట్ లో చూస్తుంటే ఎన్నో రకాల ఆలివ్ ఆయిల్స్ కనబడతాయి. ఏది నాణ్యమైనదో తెలుసుకోలేకపోతున్నాం అంటారు చాలామంది. అసలు ఆరోగ్యవంతమైన ఆలివ్ ఆయిల్ పర్ఫెక్ట్. లేబుల్ పై దీన్ని ఎక్సట్రా వర్జిన్ గా పేరుకొంటారు. అంటే ఈ ఆయిల్ సీడ్స్ ని వేడి చేయరు. మాములుగా నునెల జీవిత కాలాన్ని పెంచేందుకు రిఫైండ్ ఆయిల్స్ అన్నింటినీ వేడి చేస్తారు. రిఫైండ్ రకాన్ని సింపుల్ గా ఆలివ్ ఆయిల్ అంటారు. దీన్ని ఎక్సట్రా వర్జిన్ తో కలుపుతారు. పోమాన్ అనేది చివరిగా బయటకు తీసేది. దీనికి హై స్మోక్ పాయింట్ ఉన్నప్పటికీ ఎక్కువగా హీట్ చేయొద్దు. ఇలా వేడి చేయడం వల్ల దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. మోనో అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆలివ్ ఆయిల్ ఏ రూపంలో దైనా గుండెకు ఆరోగ్యం ఇచ్చేదే.

Leave a comment