కరోనా ముప్పు తప్పిం చుకొనేందుకు చేతులు శుభ్రం చేసుకోవటం ,శానిటైజర్ వాడటం చేస్తున్నపుటికీ,కళ్ళ విషయంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోమంటున్నారు వైద్యులు. చేతుల తో ఎన్నో ప్రదేశాలు ముట్టుకొంటూ ఆ చేతులతో కళ్ళను తాకితే వైరస్ కు మనమే మన శరీరంలోకి దారి ఇచ్చిన వాళ్ళం అవుతాము అంటున్నారు. కరోనా రోగుల్లో చాలా మందిలో కంటి కలక ఉన్నట్లు కనిపెట్టారు. 38 మందికి కరోనా సోకితే అందులో 12 మంది కంటి కలక తో బాధపడుతున్నవారే అని అధ్యయనాలు చెపుతున్నాయి. కళ్ళకు జోడు ఉన్నపుటికీ పైన కింద భాగాల్లో ఎటు నుంచయినా వైరస్ కంటిని చేరవచ్చు అంటున్నారు. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత కళ్ళను కూడా శుభ్రం చేసుకోవాలని చెపుతున్నారు.

Leave a comment