దాదాపుగా మేకప్ సామాగ్రి మొత్తం రసాయనాల తోనే తయారవుతాయి. మార్కెట్ లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ లో కూడా రసాయనాలు కలుస్తాయి. కనురెప్పలను ఆరోగ్యంగా ఉంచే ఐ లాష్ జెల్ ను రసాయనాలు వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అర టీ స్పూన్ బాదం నూనె, మూడు చుక్కల ఆమోదం, విటమిన్ ఇ క్యాప్సూల్  ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపితే ఐ లాష్ జెల్ మిశ్రమం తయారవుతుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందర దాన్ని కనురెప్పలకు రాసుకుని ఉదయం కడిగేయాలి. పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే కనురెప్పలు అందంగా కనిపిస్తాయి.

Leave a comment