రోజంతా పనితో కళ్ళు అలిసిపోతాయి. జీవంతో లేనట్లు అలసటగా ఉంటాయి. అలంటప్పుడు ముందు కళ్ళ పై చల్లని నీళ్లు చిలకరించుకుంటే ఆ అలసట కాస్త తగ్గుతుంది. బయట నుంచి రాగానే పచ్చి పాలలో దూది ముంచి కళ్ళ చుట్టు తుడుచుకోవాలి.పల్చని దూదిని చల్లని పాలలో ముందు కాసేపు కళ్ళ పై ఉంచుకోవాలి. అలాగే చల్లని కీర రసంలో దూదు పొరను ఉంచి కాసేపు కళ్ళ పై ఉంచుకున్న కళ్ళ అలసట పోయి కళ్ళు తేటగా అవుతాయి.గ్రీన్ టీలో మెత్తని వస్త్రాన్ని ఉంచి దాన్ని కళ్ళ పై వేసుకుంటే కళ్ళు మిలామిలా మెరుస్తాయి.కళ్ళ చుట్టు చర్మం వదులైనట్లు కనిపిస్తే తెల్ల సొన కళ్ళ చుట్టురాసి పదినిమిషాలు ఆరనిచ్చి చన్నిళ్ళతో కడిగేయాలి.అప్పుడు అక్కడ చర్మం బిగితుగా అయిపోతుంది.గ్రీన్ టీ బాక్స్ వాడుకున్నాక వాటిని ఫ్రీజ్ లో ఉంచి చల్లగా గడ్డకట్టి ఉంటాయి.వాటిని కళ్ళ పై ఉంచినా మంచి ఫలితం తెలుస్తుంది.

Leave a comment