ఇంట్లో ఒక అక్వేరియం ఉంటే అందులో రంగురంగుల చేపలు తిరుగాడుతూ ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన కలిగి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కొన్ని హాస్పిటల్స్ లో ముఖ్యంగా చిన్నపిల్లల ప్రత్యేక వైద్యశాలల్లో ఈ అక్వేరియంలు ఏర్పాటు చేస్తారు . వీటిని గమనిస్తూ ఉంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది . నిద్రలేమి సమస్యతో ఉన్నవాళ్ళు నిద్రపోయేందుకు ఉపక్రమిస్తూ కాసేపు ఈ తిరుగాడే చేపలను గమనిస్తే నిద్ర తొందరగా పడుతుందట . ఈ రంగు రంగుల చేపలు ఈదుతూ ఉండటం చేస్తే ఏదైనా నొప్పి కూడా తగ్గుముఖం పడుతుందట . హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు ,అల్జీమర్స్ తో బాధపడే వృద్దులు ఈ అక్వేరియం ఉనికితో ఊరట పొందుతారని చెపుతున్నారు పరిశోధకులు .

Leave a comment