గులాబీ పువ్వు ఆకృతి వచ్చేలా బ్లౌస్ స్లీవ్స్ డిజైన్ చేయటం ఇవాల్టి స్పెషల్ స్టైల్ గులాబీ పువ్వులు లేయర్ లుగా మంచి ఆకృతి వచ్చేలా నెట్, ఆర్గంజా, షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్స్ తో తయారు చేస్తారు. ఇండో వెస్ట్రన్ డ్రెస్ ల్లో ఫ్యూజన్ గౌన్లు, క్రాప్ టాప్ లు షరారి ల్లో ఇలాంటి గులాబి పూలు చాలా ఫ్యాషన్ వెస్ట్రన్ స్టైల్ లో సింగిల్ షోల్డర్ ఫ్రాక్ కు ఒక వైపు గులాబి పువ్వు చాలా అందంగా కనిపిస్తుంది. పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఫెమినైన్ లుక్, రెడ్ కలర్ అయితే స్టేట్మెంట్, గోధుమ రంగు గులాబీలు అయితే స్మార్ట్ లుక్ తో ఫోటోల్లో కూడా చక్కగా కనబడతారు. రిసెప్షన్ సంగీత్, వేడుకలకు ఈ రోజాల బ్లౌజ్ లతో పట్టుచీరలు మంచి మ్యాచింగ్.

Leave a comment