ముఖం కాంతితో మెరిసి పోవాలంటే చర్మ ఆరోగ్యం చాలా ముఖ్యం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మామిడి,పుచ్చ,కమలా,బొప్పాయి,కర్బుజా,దానిమ్మ,నేరేడు మొదలైన పళ్ళు కాప్సికం,టమేటా ఆకు కూరలు చర్మాన్ని యవ్వన వంతంగా ఉంచుతాయి. వీటిలో రెండు మూడు రకాలను రోజు తీసుకోవాలి. బాగా నీళ్ళు తాగాలి ముడి ధాన్యాలతో చేసిన ఆహారం తినాలి కడుపు నిండేంత వరకు కాకుండా ఆకలి తీరేంత వరకు తినాలి. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తే బరువు నియంత్రణలోకి రావటమే కాకుండా మొహం కాంతివంతమవుతోంది. రోజుకి ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. నిద్ర తక్కువైనా మోహంలో కాంతి తగ్గుతోంది.

Leave a comment