ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవకాశం లేనే లేదు ఇంట్లో పాటించగలిగితే చిట్కాల తోనే ముఖ చర్మం  కళకళలాడుతుంది. రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో, స్పూన్ పాలపొడి కాస్త ఆలీవ్ నూనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవచ్చు అలాగే కమలాపండు తొక్కల పొడి లో  చందనం,గులాబీ రేకుల ముద్ద,పెరుగు ముల్తానీ మట్టి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు.బంగాళదుంప సన్నగా తురిమి అందులో పెసరపిండి టమోటో గుజ్జు కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి ఆరి పోయిన తర్వాత  కడిగేస్తే ముఖం పై ఉన్న టాన్ పోయి చక్కగా మెరుస్తుంది .ముఖానికి మేలు చేసే ఈ పూతలను వారంలో నాలుగైదు సార్లు వేసుకోవచ్చు.

Leave a comment