అమ్మాయిలు చెవులకు ఆభరణాలు ఎంచుకొనేప్పుడు ముఖాకృతిని బట్టే నప్పేదానికి ఓటెయ్యాలి. ఉదాహరణకు కొలా ముఖాకృతి అయితే పెద్ద పెద్ద రింగులు బావుంటాయి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఒక దానోల్లో ఒకటి ఇమిడి పోయే డిజైన్ ఉన్న హ్యాంగింగ్స్  చాలా బావుంటాయి.జీన్స్ షర్టు,పొడవాటి గౌన్లపై ఈ తరహా రింగులు చక్కగా ఉంటాయి. అలాగే బుట్టలు కూడా కోలముఖాకృతికి అందం ఇస్తాయి. చెవులకు చిన్న దిద్దులు దానికి వేలాడే బరువైన బుట్టలు సంప్రదాయ దుస్తులకు సూట్ అవుతాయి. ముత్యాలు రాళ్ళూ కుందన్లు ఆకర్షణీయమైన రంగులలో పరికిణీలు,ఓణీ,గాగ్రా చోళీ లెహంగాలకు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇక పార్టీ వేర్ లో  జుమ్కీలు,బుట్టలకు తోడుగా ఇయర్ కాప్స్ బావుంటాయి.

Leave a comment