కొందరిలో చాలా తొందరగా వార్ధక్యఛాయలు కనిపిస్తాయి మొహం పైన ముడతలు వచ్చేస్తాయి.అవి పోయేందుకు ఒక మంచి చిట్కా చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మామిడి ఆకులు ఎండబెట్టి పొడి చేయాలి అందులో మినప పప్పు పొడి, ముల్తానీ మట్టి సమన పాళ్లలో కలిపి ఓ డబ్బాలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని పాలతో కలిపి పేస్ట్ గా చేసి మొహం పై ప్యాక్ వేసుకుంటే ముడతలు పోతాయి. అలాగే బంగాళదుంప గుజ్జు, టమోటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముఖం పైన ముడతలు పొగొడతాయి.అలాగే క్యారెట్ రసంలో పాలు,బాదం పప్పు పేస్ట్ కలిపి ఆ మిశ్రమంతో ప్యాక్ వేసుకుంటే కూడా ముడతలు పోతాయి.

Leave a comment