ఒత్తిడి వల్లనో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్లనో మొహం పైన నలుపు పేరుకు పోతుంది. ఈ టాన్ పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు.రెండు స్పూన్ల బార్లీ పొడిని ఉడకబెట్టి అందులో కాస్త నిమ్మరసం కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ పేస్ట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం క్రమంగా క్రమంగా తగ్గుతోంది పెసరపిండి, ఉలవ పిండి లో కీరదోస రసం కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నానబెట్టి గుజ్జు చేసి అందులో బొప్పాయి గుజ్జు కలిపి ప్యాక్ వేసుకుంటే, వెంటనే ఫలితం తెలిసిపోతుంది.ఇవి ప్రతి రోజు వేసుకోవచ్చు.

Leave a comment