మనసులో ఒత్తిడి తలెత్తితే ఆ ప్రభావం ముఖంపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం పైన ముడతలు గీతలు వస్తాయి అలాంటప్పుడు యోగా తో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు నంటున్నారు యోగా మాస్టర్స్.అర చేతులతో  మెడ భాగాన్ని మర్దన చేయాలి.మెడ దగ్గర చర్మం టాన్ అవుతోంది నోటి నిండా గాలిపీల్చి, దాన్ని అదిమి ఉంచి ఆ గాలిని కుడి ఎడమ చెక్కిళ్ళ వైపు నెమ్మదిగా జరుపుతూ ఉండాలి.రెండు అరచేతులు చెక్కిళ్ళ ఎముకల దగ్గర పెట్టి పైకి కిందికి మసాజ్ చేయాలి.దానితో ముఖ కండరాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. చేతివేళ్లను నుదిటి పైన పెట్టి నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్లు కదిలించాలి.దాంతో ముఖం పైన గీతలు తగ్గిపోయి ముఖం ప్రకాశవంతంగా అయిపోతుంది.

Leave a comment