నాకు సోషల్ మీడియాలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళలో లక్ష మంది ముందుకు వచ్చి తలా కొంచెం సాయం చేసిన నా లక్ష్యం పూర్తవుతుంది అంటుంది ప్రియాంక చోప్రా.గివ్ ఇండియా అన్న సంస్థ తో కలిసి కోవిడ్ విరాళాలు సేకరిస్తోంది ప్రియాంక .నేను పుట్టిన గడ్డ ఆపదలో ఉంది ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అంటూ భావోద్వేగ పూరితంగా ప్రియాంక ఇచ్చిన పిలుపుకు విదేశాల్లో ఉండే యూట్యూబ్ స్టార్ లిల్లీ సింగ్ వోల్వో రైన్ హీరో హగ్ జాక్  మాన్ వంటి వాళ్లు కదిలి వచ్చారు. వారు కూడా ప్రియాంక పిలుపుని షేర్ చేస్తూ భారతదేశానికి అండగా నిలబడమని ప్రపంచ దేశాలను కోరుతున్నారు ఇప్పటి వరకు సేకరించిన రెండున్నర కోట్ల రూపాయలను కోవిడ్ కేర్ సెంటర్లకి వాక్సిన్ లు సమకూర్చేందుకు ఉపయోగించింది ప్రియాంక చోప్రా.

Leave a comment