గుజరాత్ రాష్ట్రంలోని కచ్ తీరం హస్తకళలకు సుప్రసిద్ధం. ముఖ్యంగా అక్కడ మిర్రర్ ఇమేజ్ పద్ధతిలో వేసే రోగన్ ఆర్ట్ గొప్ప నైపుణ్యం గల చిత్రకళ అచ్చం ఎంబ్రాయిడరీ లాగా కనిపించే ఈ రోగన్ ఆర్ట్ ఒక లావుపాటి సూదితో రంగుల్లో ముంచుతూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తారు ఆముదాన్ని మండే దశ వరకు మరిగించి అందులో చల్లని నీళ్ళు పోస్తే అది సాగుతూ వస్తుంది. అందులో కోరిన రంగులను కలుపుతూ ఇవి ఎంతసేపైనా గట్టిపడకుండా ఉంటాయి.ఏనాడో మొఘల్ చక్ర వర్తులు కాలం లో కచ్ తీరానికి చెందిన ముస్లిం ఖత్రాలు ఈ కళ్ళతో అద్భుతమైన చిత్రాలు వేసే వారని చెబుతారు. ఇక్కడి నిరోనా గ్రామానికి చెందిన ఖత్రాలు కుటుంబం గత మూడు వందల ఏళ్లుగా ఈ కళని కొనసాగిస్తున్నారు.

Leave a comment