కోమల్ పాండే ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ ఒక పండగ వేళ చుడిదార్ ని ఆధునికంగా ఎలా ధరించాలో చూపెట్టిన పోస్ట్ ను నటి సోనమ్ కపూర్ లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా అట్లా ధరించేందుకు ప్రయత్నం చేయడంతో కోమల్ పాండే పేరు మోగిపోయింది. ఇప్పుడు వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ ఆమె ఇంస్టాగ్రామ్ కు 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభావిత ఇన్ ఫ్లుయన్సర్ గా అవార్డు లు అందుకుంది కోమల్ పాండే. ఢిల్లీలో కామర్స్ చదివిన కోమల్ సాధారణ డ్రెస్ కు ఆధునికంగా ఎలా మార్చుకోవాలో చూపెడుతూ ఫేస్ బుక్  లో ఈరోజు లుక్ అంటూ ఫోటోలు పెట్టేది. దీన్ని గమనించి పాప్‌క్సో అనే సంస్థ ఆమెకు అవకాశం ఇచ్చింది. అట్లా పాపులారిటీ పెరిగింది. ఈమె యూట్యూబ్ ఛానల్ కు పది లక్షల మంది ఫాలోవర్స్.

Leave a comment