కరోనా తరుణం  కనుక ఎంతో మంది రకరకాల మాస్క్ లు ధరించి కనిపిస్తూ ఉంటారు.డిజైనర్ మాస్క్ లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.ఫ్యాషన్ మాస్క్ అయినా పర్లేదు కానీ మాస్క్ పొరలు పొరలు గా ఉండేది ధరించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మాస్క్ ధరించినప్పుడు శ్వాస తేలికగా ఆడే లా ఉండాలి ముక్కు పై భాగం నుంచి గడ్డం వరకు పూర్తిగా మూసేంత  పెద్దదిగా ఉండాలి.మాస్క్ మాటి మాటికీ కిందకు జార కూడదు.చర్మానికి మాస్క్ గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి .పట్టీలు తల వెనక నుంచి కట్టుకునే లా బిగుతుగా ఉండాలి.గుడ్డ తో చేసినవి మంచివే కానీ ప్రతిరోజూ ఉతుక్కోవలి ఎండలో ఆరవేయాలి వేడి సోకేలా ఇస్త్రీ చేయాలి ఉతికితే వాటి ఆకారం పోకుండా ఉండాలి.

Leave a comment