60 ఏళ్ళ లిన్‌ స్లేటర్‌ హటాత్తుగా ఫ్యాషన్ ఐకాన్ అయిపోయింది. లిన్‌ స్టైల్‌ని ప్రముఖ ఫ్యాషన్‌ సాధనాల ఉత్పత్తుల సంస్థ ఎలైట్‌ లండన్‌ గుర్తించింది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం లిన్‌తో ఈ జనవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అనుకోకుండా ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ వార్తాల్లో కెక్కింది. లిన్ స్లేటర్ కు స్టైల్ గా ఉండే దుస్తులంటే ఇష్టం. యాక్సిడెంటల్ ఐకాన్ పేరుతో ఒక బ్లాగ్ ఓపెన్ చేసి తనకు నచ్చిన డ్రెస్ తో పోటోలు దిగి ఈ బ్లాగ్ లో పోస్టు చేసేది. ఆమె కు వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. వయసుకి ఫ్యాషన్ గా ఉండేందుకు సంబంధం లేదంటూ లిన్ పెట్టే ఫోటోలకు వచ్చిన స్పందన ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలోకి లాక్కొచ్చింది.

Leave a comment