పాత కాలంలో పట్టు చీరెల తో ఇవాల్టి కాలానికి తగ్గట్లు డ్రెస్ లుగా మార్చేయండి, ఇదే ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్ అంటున్నారు ఎక్సపర్ట్స్.పాత పట్టు చీరెలకు ఖరీదైన అందమైన జరీ ఉంటుంది.  గాఢమైన ముదురు వర్ణాలు ఉంటాయి ఆరుగజాల చీరెను అందమైన అనార్కలీ డ్రెస్ గా మార్చేయచ్చు మిగతా మిగిలిన మొక్క క్రాప్ గా వాడేయచ్చు. బనారస్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ డిజైన్ లో ఉన్నచీరెలు అందమైన దుపట్టా లుగా బావుంటాయి.చిక్ బ్రోకేడ్ చీరెలు లెహంగాలుగా మార్చేయచ్చు. పట్టు చీరెలు గట్టి జరీ పైటకొంగు ఎంతో అందమైన బ్లౌజులు తయారవుతాయి. సాదా లెహంగా పైకి ఈ జరీ జాకెట్లు చాలా అందంగా ఉంటాయి.

Leave a comment