Categories
ఎప్పటికప్పుడు కొత్తదనం వెతక్కపోతే మార్కెట్ ని అందుకోవటం కష్టం .ముఖ్యంగా నగలు ,డ్రెస్ లు , వీటికి మ్యాచింగ్స్. ఫ్యాషన్ ట్రెండ్ ముందుగా నగలకే వర్తిస్తుంది. ఒళ్ళంత నగలు ఎప్పడు ఇష్టడరు అమ్మాయిలు. ఫ్యాషన్ స్టేట్ మెంట్స్ చెవి పోగులే ముఖానికి అందం ఇచ్చే లోలాకులు ,దిద్దులూ ఎప్పటికప్పుడు మారి పోవాలి. అలా ట్రెండీగా మార్కెట్ లోకి వచ్చాయి లాంగ్ చెయిన్ ఇయర్ రింగ్స్ చెవి దగ్గర నుంచి భుజాల వరకు గొలుసుల్లా వేలాడుతూ ఇటు మోడ్రన్ డ్రెస్ లకు సంప్రదాయ వస్త్రాలకు సరిగ్గా సూటయ్యాయి .బుట్టాలకు ఇయర్ కప్స్ కు వేలాడుతూ పూసలు ,రాళ్ళు కలగిసి వేలాడే లాంగ్ చెయిన్ ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఫేవరేట్స్.