అనుష్క శర్మ ప్రధాన పాత్రలో చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమా రాబోతోంది. ప్రపంచ క్రికెట్ లో సంచలనాలకు మారు పేరైన భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవిత కథ పశ్చిమ బెంగాల్ లో మారుమూల పల్లె చక్దా లో పుట్టి ఝులన్ 19 ఏళ్ల వయసులో బెంగాల్ జట్టు కు ఆడటం మొదలుపెట్టారు. క్రికెట్ నే ప్రేమించి అందులో రాణించి 2017 మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు వెళ్ళిన జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. మహిళా క్రికెటర్లకు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో అత్యున్నత ప్రదర్శనతో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ఝులన్ 2006 లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఉమెన్ బౌలర్ గా చరిత్ర సృష్టించారామె.

Leave a comment