మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాళ్లు ముదురు రంగులు ఇష్టపడతారు. తటస్థ వైఖరి ఉన్న వాళ్లు సాదా రంగు ఇష్టం. హుందాగా ఉండేవారు లేత రంగులు వెతుకుతారు సృజనాత్మకంగా ఉండేవాళ్ళు ఆఫ్ బీట్ కలర్స్ ని ఇష్టం అంటారు. సైకాలజిస్ట్ లు ఏమంటారంటే రంగుని బట్టి ఎలాంటి వ్యక్తు లో వాళ్లలో ఎలాంటి లోపాలు చెప్పచ్చునని. ఉదాహరణకు ఎరుపు రంగును ఇచ్చే వారు సాధారణంగా కోపిష్టులు తన వాదన నెగ్గాలనే పట్టుదల తో ఉంటారు మంచి నాయకత్వ లక్షణాలు నిజాయితీ ఎరుపును మెచ్చే వాళ్ళ పాజిటివ్ లక్షణాలు. ఇక తెలుపు రంగు ఇష్టమైతే, శాంతి గా ఆశావహ దృక్పధం తో ఉంటారు కష్టసుఖాలు బ్యాలెన్స్ చేసుకుంటారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. కానీ ఏ విషయంలో అయినా మూడు పాడైతే వాళ్ళని మామూలు స్థితికి తీసుకు రావటం చాలా కష్టం. నలుపు రంగు ఇష్టపడే వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎలాంటి సందర్భాల్లో అయినా తమని తాము కంట్రోల్లో ఉంచుకుంటారు. పసుపు రంగు అయితే సంతోషానికి చిరునామా అనచ్చు. ఈ రంగును ఇష్టపడే వాళ్ళు సరదాగా ఉత్సాహంగా ఉంటారు త్వరత్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి సందర్భంలో అయినా తేలికగా హ్యాండిల్ చేస్తారు. చాలా ఎమోషనల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. త్వరత్వరగా నిర్ణయాలు మార్చుకోవటం వీరిలో ఉండే నెగిటివ్ పాయింట్. గులాబీ రంగు ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ ఇతరుల పట్ల ప్రేమభావంతో ఉంటారు. చాలా సున్నితమైన వాళ్ళు. చక్కగా పాజిటివ్ గా ఆలోచిస్తారు మృదువుగా మాట్లాడతారు. ప్రతి వ్యక్తిలో మంచినే చూస్తారు చెడు విషయాలు పట్టించుకోరు. చాలా నమ్మదగిన వాళ్లు కూడా.

Leave a comment