ఆఫీస్ పని ,ఇంట్లో తీరిక లేని చాకిరీ,చదువుల భారం వ్యక్తిగత సమస్యలు ఏవైనా కావచ్చు లోపాల వత్తిడి పెరిగి పోతూ ఉంటుంది . అందులోంచి బయట పడాలంటే ఇలా చేసి చూడచ్చు . క్రాస్ వర్డ్ ఫజిల్స్  చేయచ్చు . అందులో మునిగిపోతే మనసుకు ఊరటగా ఉంటుంది . పుస్తకాల్లో బొమ్మలకు రంగులు నింపండి అని రేఖాచిత్రాలు ఇస్తారు . అవి పిల్లలకే కాదు ,పెద్దలకే మంచి వ్యాపకమే . దీర్ఘ శ్వాస తీసుకొనే ప్రాణాయామం ఒత్తిడి తాలూకా గాబరాని తగ్గిస్తాయి . రోజువారి ఆహారంలో కెఫిన్ లేకుండా జాగ్రత్త పడాలి . వేడినీళ్ళ స్నానం ఉపశమనం ఇస్తుంది మార్కెట్ లో దొరికే స్ట్రెస్ బోల్ తీసుకోని వ్యాయామం చేయటం కూడా మనసుని తేలిక చేస్తుంది .

Leave a comment