ఇద్దరు పిల్లల తల్లి. నువ్వు వ్యవసాయం ఏం చేస్తావు అన్నారు ప్రజలు. సంగీత పింగ్లే వ్యవసాయాన్ని బ్రతుకుతెరువు గా ఎంచుకున్న సమయంలో మహారాష్ట్ర నాసిక్ లోని మాటొరి గ్రామం సంగీత  పింగ్లే స్వస్థలం భర్త మను గారు మరణించాక ఇద్దరు పిల్లల కోసం సైన్స్ గ్రాడ్యుయేట్ సంగీత ద్రాక్ష తోటల పెంపకం చేపట్టింది. 13 ఎకరాల వ్యవసాయ భూమి లో వంటరిగా అన్ని పనులు చేసింది ట్రాక్టర్ నడపడం దాన్ని రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఎనిమిది వందల నుంచి వెయ్యి టన్నుల ద్రాక్ష పండిస్తోంది ఏటా 30 లక్షల ఆదాయం పొందుతోంది సంగీత. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదని రుజువు చేసింది సంగీత  పింగ్లే .

Leave a comment