దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే చెబుతోంది. ఈ నవంబర్ లో నిర్వహించిన సర్వే లో మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2019-2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని సర్వే చెబుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత జరిగే బ్రూణ హత్య కారణంగా ఆడ పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజా నివేదిక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని, ఆడపిల్లల సంఖ్య పెరిగిందని చెబుతోంది.

Leave a comment