చెంచల్ గూడ జైల్లో,వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మహిళా ఖైదీలు కరోనా వ్యాప్తిని అరికట్టే దశలో వాడుకొనేందుకు వీలుగా ఉండే మాస్క్ ల తయారీలో లీనమయ్యారు. అందరు కలసి ఒక్కరోజులో ఏడెనిమిది వేల మాస్క్ లు తయారు చేయగలుగుతున్నారు.  వీటిని  వైద్యులు పోలీస్ సిబ్బంది వాడకం కోసం నిత్యం పంపిణి చేస్తున్నారు. ఇవి ఒకసారి వాడుకొన్నాక,మళ్ళి ఉతికి శుభ్రం చేసి వాడుకొనేందుకు వీలుగా మెత్తని గుడ్డ లతో తయారు చేస్తున్నారు. తమ వంతు సాయంగా ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెపుతున్నారు మహిళా ఖైదీలు.

Leave a comment