ఇప్పటివరకు గూఢచారి జేమ్స్ బాండ్ నవలలను ఆరుగురు రచయితలు రాశారు. వారి సరసన చేరారు రచయిత్రి కిమ్‌ షెర్వుడ్‌  ఆమె రాసిన టెస్ట్ మెంట్ నవల బాత్ నోవెల్ అవార్డు అందుకుంది. ఆ నవల ద్వారా కిమ్‌ షెర్వుడ్‌ బాండ్ నవలలు రాసే అవకాశం దక్కించుకున్నారు పాత జేమ్స్ బాండ్ 007 అయితే రాయబోయే నవలలో 00 ఏజెంట్స్ ఉంటారు ఇప్పటివరకు బాండ్ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా రచయిత జేమ్స్ బాండ్ నవలలకు స్త్రీవాద దృక్పధాన్ని జోడించాలను కొంటున్నానని చెబుతోంది. కిమ్ రాస్తున్న ట్రయోలజీ  లో మొదటి నవల వచ్చే ఏడాది సెప్టెంబర్లో రానున్నది జేమ్స్ బాండ్ ఆరాధించే వాళ్ళు ఇప్పుడో కొత్త జేమ్స్ బాండ్ ను చూడబోతున్నారు.

Leave a comment