Categories
మాగ్రామంలో కరోనా బాధితులు ఉండకూడదని నిర్ణయించుకున్నాం .అందుకే బయట గ్రామం నుంచి ఎవరినీ అనుమతించ కుండా కాపలా కాస్తున్నాం అంటున్నారు జమ్మూ కాశ్మీర్ లోని చత్తా పిండ్ గ్రామ వాసులు .ఆరున్నర వేల ఇళ్ళు వేలమంది జనం ఉన్నా ఈ గ్రామం లోకి కరోనా వస్తే సమస్య అవుతుందని గ్రామ వాసులు పక్కాగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఊరిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు .ఇవంతా గ్రామ మాజీ సర్పంచ్ సామాజిక కార్యకర్త గూర్మత్ కౌర్ నేతృత్వం లో జరుగుతోంది . ఆమె సారధ్యంలో ఊరు మహిళలంతా కలసి వంతుల వారిగా గ్రామాన్ని సంరక్షించుకొంటూ భద్రతను కట్టుదిట్టం చేశారు .