ఏ వయసు వారికైనా పూల ప్రింట్లు నప్పుతాయి. చీరె అయినా టాప్, బాటమ్ ఏదైనా పూల డిజైన్ లు అందమే. పూల ప్రింట్లు స్కార్ట్ లు పాలజాలు సాదా టాప్ లు ఎంతో ఫ్యాషన్. అలాగే గళ్ళ డిజైన్ లో కుర్తి లు ప్యాంట్ జాకెట్ లు ఆఫీస్ దుస్తులుగా హుందాగా ఉంటాయి. ఈ కాలంలో చేనేతలకు చేతి వృత్తులకు ఆదరణ పెరిగింది. టై అండ్ డై బాతిక్, చాందిని, లేహరియా కలంకారి అబ్ స్ట్రాక్ట్ ప్రింట్స్ లో చేనేత దుస్తులు చక్కగా ఉంటాయి. ఇలా పూల డిజైన్, కలంకారి గళ్ళ ప్యాంట్లు ఒకదానికొకటి మేళవింపు కాదునుకుంటారు. కానీ ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ గా ధరిస్తేనే సరికొత్త అందం. ఈ చిరుజల్లుల లేత రంగులపై పూల ప్రింట్లు ఎంచుకుంటే సాయంత్రాలు మరింత వెలుగ్గా  అనిపిస్తాయి అంటారు డిజైనర్స్.

Leave a comment