పండగ రోజుల్లో ముదురు రంగు దుస్తులు వేసుకుంటే ఆ వాతావరణానికి మరింత శోభ వస్తుంది అంటారు స్టైలిస్ట్ లు సంక్రాంతి వంటి పండుగలకు చేనేత వస్త్రాలు బాగుంటాయి.పండగ స్పెషల్స్ గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లుల మధ్య చేనేత వస్త్రాలు హుందాగా కనిపించడమే కాక వ్యక్తుల హుందాతనం కూడా చూపిస్తాయి జతగా పెద్దపెద్ద బుట్టలు, చాంద్ బాలీలు పెట్టుకోవాలి లెహంగాలు కుర్తీలకు తోడు స్కార్ఫ్ లు వాడటం తాజా ఫ్యాషన్. అయితే ముఖ్యంగా అందంగా కనిపించడం ఎలా ఉన్నా ఏ దుస్తులు వేసుకున్నా ఎంత సౌకర్యంగా ఉన్నామానేది చాలా ముఖ్యం అంటున్నారు స్టైలిస్ట్ లు.

Leave a comment